‘పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచండి’

Telangana HC Orders EC Over Extension Of Graduate Voters Enrollment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందనగా.. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదు అవకాశం కల్పిస్తామని ఈసీ, కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్‌ జారీచేస్తామని వెల్లడించింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు గడువు పెంచాలంటూ న్యాయవాది రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.

ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు నేటితోనే ముగుస్తుందని ఈసీ కోర్టుకు తెలిపింది. చట్టప్రకారం నవంబరు 7లోపే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఒకవేళ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.(చదవండి: అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top