హైదరాబాద్‌లో చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు | Telangana HC On HMDA Lakes Control | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు

Published Wed, Nov 27 2024 8:59 PM | Last Updated on Wed, Nov 27 2024 8:59 PM

Telangana HC On HMDA Lakes Control

హైదరాబాద్‌: నగరంలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌ నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.

రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.  ఇవాళ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ విచారణకు హాజరై.. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే.. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయినట్టు వెల్లడించారు. అయితే..

మూడు నెలల్లోగా హైదరాబాద్‌ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 30కి వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement