తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం | Telangana Govt Has Decided To Hold Cabinet Meeting Twice Every Month, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై 15 రోజులకోసారి కేబినెట్‌ మీటింగ్‌

Jun 6 2025 10:11 AM | Updated on Jun 6 2025 10:48 AM

Telangana Govt Has Decided To Hold Cabinet Meeting Twice Every Month

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్​ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నిర్ణయించారు.

విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా కేబినెట్‌ను నెలకు రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు జరపనున్నారు.

మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా  ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడో శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 17 సార్లు కేబినేట్​ భేటీలు జరిగాయి.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

Advertisement
 
Advertisement
Advertisement