రైతు బంధుతో సమస్యలా? ఈ నెంబర్లకు కాల్‌ చేయండి

Telangana Govt Appeals to Banks Release Rythu Bandhu Money to Farmers - Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ఆదేశాల అనుసరించి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు.

రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని గౌరవనీయ ఆర్ధిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన/సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 1800-200-1001, 040-33671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్,  పంపిణీని బ్యాంకర్లు  వేగవంతం చేయాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు.

చదవండి: రూ.7444 ఇంజెక్షన్‌ @రూ.35 వేలు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top