తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రద్దు

Telangana Government Cancelled Intermediate Second Year Exams 2021 - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్‌ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్‌ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారు. ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top