మే 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబందు

Telangana Farmers to get Rythu Bandhu Money from June 15 - Sakshi

తెలంగాణ రైతుల ఖాతాలో మే 15 నుంచి 25 వరకు రైతుబందు నగదు జమ కానుంది. ఈ  పథకానికి అర్హులైన రైతుల జాబితాను సీసీఎల్‌ఏ అందజేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18లక్షల ఎకరాలకు 7508.78 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గత యాసంగి కన్నా 2.81లక్షల మంది రైతులు పెరిగారని నూతనంగా 66,311ఎకరాలు ఈ పథకంలో చేరినట్లు మంత్రి తెలిపారు. 

మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని మంత్రి సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్​సీ కోడ్​లు మారిన వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఏమైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గానూ రూ.14,656.02 కోట్లు, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్​లో రూ.14,800 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

చదవండి: పెట్రో ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top