తెలంగాణ విద్యా క్యాలెండర్‌ విడుదల

Telangana Education Academic Calendar Released - Sakshi

దసరా, సంక్రాంతికి మళ్లీ సెలవులు

మూడో వేవ్‌ వస్తే మళ్లీ గతం మాదిరే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పాఠశాల విద్యా క్యాలెండర్‌ విడుదలైంది. విద్యా శాఖ అధికారులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ ఈయర్ విడుదల చేశారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వివరాలు తెలిపారు. ఏప్రిల్ 23 పాఠశాలల చివరి పని దినమని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల పని దినాలు 213, 47 రోజులు ఆన్‌లైన్ తరగతులు జరుగుతాయని వివరించారు.
చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్‌

క్యాలెండర్‌ ఇలా..

  • FA1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి
  • SA1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 8 డిసెంబర్ వరకు
  • FA2 పరీక్షలు పదో తరగతి జనవరి 31 నుంచి
  • FA2 పరీక్షలు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నుంచి
  • SA2 పరీక్షలు 1 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి18 వరకు
  • పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ ఫిబ్రవరి 25 లోపు
  • మార్చి లేదా ఏప్రిల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు
  • దసరా సెలవులు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు
  • సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి జనవరి 16 వరకు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top