లోన్‌ యాప్‌ నిర్వాహకులకు డీజీ షికా గోయల్‌ హెచ్చరికలు | Telangana Cyber Security Bureau Director Shikha Goel Warning To Loan Apps, Betting Apps Promoters | Sakshi
Sakshi News home page

లోన్‌ యాప్‌ నిర్వాహకులకు డీజీ షికా గోయల్‌ హెచ్చరికలు

Mar 21 2025 3:27 PM | Updated on Mar 21 2025 3:58 PM

Telangana Cyber Security Bureau Director Shikha Goel Warning To Loan Apps, Betting Apps Promoters

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే. త్వరలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న లోన్ యాప్‌ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ హెచ్చరికలు జారీ చేశారు.

తెలుగు రాష్టాలను కుదిపేస్తున్న బెట్టింగ్  యాప్స్  వ్యవహారంలో టాలీవుడ్  డొంక కదులుతోంది. తాజాగా బెట్టింగ్  యాప్స్  ప్రమోట్  చేసిన  సినీ ప్రముఖులు, సోషల్  మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై మియాపూర్  పోలీస్  స్టేషన్‌లో కేసు నమోదైంది. మియాపూర్  వాసి ఫిర్యాదు మేరకు సినీ ప్రముఖులతో పాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులిచ్చి విచారణ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బెట్టింగ్స్‌ యాప్స్‌ వ్యవహారంపై శిఖా గోయల్‌ స్పందించారు. 2022 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 797 బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు నమోదు చేశాం. చట్ట ప్రకారం కఠినంగా బెట్టింగ్ యాప్‌ ప్రమోటర్లపై చర్యలు తీసుకుంటాం.

దేశంలోని 133 బెట్టింగ్ యాప్‌ కంపెనీలను గుర్తించాం. అందులో కొన్నిటికి బెట్టింగ్ యాప్‌ నిర్వహణను ఆపాలని ఆదేశాలు జారీ చేశాం. 
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ను ఏ విధంగా ఉపయోగించిన నిషేధమే లోన్ యాప్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

బెట్టింగ్‌ యాప్‌లో మోసం.. ప్రాణం తీసుకున్న యువకుడు  
బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో  పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్స్‌లో వర్క్ చేస్తున్న కొరవీణ సాయి తేజ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టాడు. మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement