Telangana: సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేసిన పోలీసులు

Telangana Cops Stop Covid 9 Patients in Ambulances From Border States - Sakshi

ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు

హైదరాబాద్‌ లో బెడ్‌ అలాట్‌మెంట్‌ ఉంటేనే పంపుతామని స్పష్టీకరణ

కొన్నిచోట్ల బెడ్‌ అలాట్‌మెంట్‌ ఉన్నా పంపని వైనం

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వాసుల అడ్డగింత

సాధారణ వాహనాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారికి యథాతథంగా అనుమతి

ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ కరోనా బాధితుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను అంబులెన్స్‌ లో తీసుకుని సోమవారం హైదరాబాద్‌ బయలుదేరారు. తెలంగాణలో ఆలంపూర్‌ వద్దకు రాగానే పోలీసులు ఆ అంబులెన్స్‌ ని ఆపి.. రాష్ట్రంలోకి రావడానికి అనుమతి లేదంటూ వెనక్కి వెళ్లమన్నారు. వారు ఎంత బతిమిలాడినా వినలేదు. ఓ ఎమ్మెల్యే ఫోన్‌ చేసినా.. తెలంగాణ పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో బాధితుడు కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

కర్ణాటక నుంచి ఆదివారం అర్ధరాత్రి కరోనా రోగితో వచ్చిన ఓ అంబులెన్స్‌ ను గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్దే పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్‌లో బెడ్లు ఖాళీ లేవని వెనక్కి వెళ్లాలని సూచించారు. తమకు బెడ్‌ అలాట్‌మెంటు ఉందని చూపించినా వెనక్కి పంపించారు. 

సాక్షి, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను తెలంగాణలోకి అనుమతించడంలేదు. రాష్ట్రంలో కరోనా పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పాజిటివ్‌ రోగులను రాష్ట్రంలోకి రానివ్వడంలేదు. అలాంటివారిని తీసుకొస్తున్న అంబులెన్సు లను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడు ్డకుని వెనక్కి పంపిస్తున్నారు. సాధారణ వాహనాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారిని అనుమతిస్తున్నా.. కరోనా బాధి తులను మాత్రం అడుగు పెట్టనివ్వడంలేదు.  

40 శాతం పొరుగు రాష్ట్రాల వారే.. 
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో దాదాపు 40 శాతం మంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్, ఒడిశాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు వారికి ఎలాంటి షరతులూ లేకుండా చికిత్స అందించిన ప్రభుత్వం.. ఆదివారం రాత్రి నుంచి అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను రాష్ట్రంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ–ఆంధ్రా సరిహద్దులైన వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజాలతోపాటు ఏపీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించే మాచర్ల మార్గంలో నాగార్జున సాగర్‌ వద్ద, దాచేపల్లి మార్గంలో వాడపల్లి వద్ద, మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన వద్ద, హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం రామాపురం వద్ద  ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ.. కోవిడ్‌ రోగులున్న అంబులెన్సులను వెనక్కి పంపిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్‌ ఉన్నట్టు పత్రాలు చూపించినవారిని మాత్రం రాష్ట్రంలోకి అనుమతించారు. ఈ విషయంపై ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌ గఢ్, మహారాష్ట్ర ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించిన కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. వీరంతా ఆక్సిజన్‌ సిలిండర్లతో లైఫ్‌ సపోర్ట్‌ వచ్చిన వారే కావడం గమనార్హం.

ఏపీ నుంచే బాధితులు అధికం.. 
తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్‌ కంటే ఏపీ నుంచే రోగుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే ఆ అంబులెన్సులను ఆపడంతో చాలావరకు అక్కడే నిలిచిపోయాయి. రోగి కేస్‌షీట్‌ చూసి కరోనా పాజిటివ్‌ అయితే వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్‌ అలాట్‌మెంట్‌ చూపిస్తే అనుమతించినా.. మరికొన్ని చోట్ల అంగీకరించలేదు. ఎందుకు ఆపుతున్నారన్న ప్రశ్నకు హైదరాబాద్‌లో బెడ్లు లేవని, ఆక్సిజన్‌ కొరత ఉందని అందుకే ఆపమంటూ తమకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని పలువురు కిందిస్థాయి పోలీసులు తెలిపారు. దీంతో చాలామంది తెల్లవారుజాము వరకు ఎదురుచూసి వెనక్కి వెళ్లిపోయారు.

ఇక కర్ణాటక, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఉండటంతో అక్కడ నుంచి వచ్చే రోగుల సంఖ్య పెద్దగా లేదు. అందుకే, ఈ విషయంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ పోలీసులు తామెవరినీ ఆపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని ఉమ్మడి ఆదిలాబాద్‌ పోలీసులు తెలిపారు. అయితే, రాష్ట్రంలోకి ప్రవేశించే వారు ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం నోట్‌ చేసుకుని అనుమతిస్తున్నామని వెల్లడించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏపీ మీదుగా భద్రాచలం ద్వారా రావాలనుకున్న కరోనా పేషెంట్లకు ఎంట్రీ లేదనే చెబుతున్నారు. 

మానవత్వంతో చూడండి: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను 
ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలగాంణలోకి అనుమతించకపోవడంపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడారు. కోవిడ్‌ బాధితులపై మానవత్వం చూపాలని కోరారు. అంబులెన్సులను నిలిపివేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగా ణ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-05-2021
May 11, 2021, 11:49 IST
దొడ్డబళ్లాపురం: కరోనా రక్కసి అనుబంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్‌ కుటుంబం మొత్తం...
11-05-2021
May 11, 2021, 11:44 IST
చిత్తూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో)లో చేరాడు. వారం తర్వాత మెరుగైన...
11-05-2021
May 11, 2021, 11:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా...
11-05-2021
May 11, 2021, 11:21 IST
మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.
11-05-2021
May 11, 2021, 10:23 IST
సాక్షి, బెంగళూరు: కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలను అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో...
11-05-2021
May 11, 2021, 09:45 IST
ఒంగోలు టౌన్‌: కరోనా బారిన పడినవారు మానసిక ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం...
11-05-2021
May 11, 2021, 09:33 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం కచ్చితం. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్‌ నుంచి...
11-05-2021
May 11, 2021, 08:51 IST
వాషింగ్టన్‌: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశంలో...
11-05-2021
May 11, 2021, 08:33 IST
సాక్షి, హిమాయత్‌నగర్‌: ఆక్సిజన్‌ అందక కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఎవరూ మరణించలేదని వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఆదివారం...
11-05-2021
May 11, 2021, 05:52 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే,...
11-05-2021
May 11, 2021, 05:10 IST
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు బయో మెట్రిక్‌ హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం...
11-05-2021
May 11, 2021, 05:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడ్డాయి. దేశంలో కోవిడ్‌ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష...
11-05-2021
May 11, 2021, 04:56 IST
ముంబై: చేసిన సాయం చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని ప్రఖ్యాత బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌(78) స్పష్టం చేశారు. దేశమంతటా...
11-05-2021
May 11, 2021, 04:45 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న తరుణంలో శీతల పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు చెబుతుండటంతో..
11-05-2021
May 11, 2021, 04:27 IST
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్‌ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు...
11-05-2021
May 11, 2021, 04:21 IST
కోవిడ్‌–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్‌ రంగం తీవ్రంగా దెబ్బతింది.
11-05-2021
May 11, 2021, 04:00 IST
శృంగవరపుకోట రూరల్‌: అన్ని దేశాలు కరోనా బారినపడి అల్లాడిపోతుంటే.. విజయనగరం జిల్లా ముషిడిపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజనులు ఊరు దాటకుండా...
11-05-2021
May 11, 2021, 03:48 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలను కోవిడ్‌ నుంచి విముక్తి కల్పించేందుకు విదేశాల్లో ఎక్కడైనా వ్యాక్సిన్‌ లభిస్తే కొనుగోలు చేసేందుకు రాష్ట్ర...
11-05-2021
May 11, 2021, 03:45 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు తక్షణం సేవలందించేలా 104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఈ వ్యవస్థ...
11-05-2021
May 11, 2021, 03:33 IST
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా పది రోజులుగా అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. సగటున రోజుకు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top