‘మునుగోడు’కు మండలాల వారీ ఇన్‌చార్జులు 

Telangana Congress Party Appointed In Charges For Munugodu By Poll - Sakshi

ఇద్దరు నేతలను నియమించిన కాంగ్రెస్, త్వరలో ప్రకటన 

ఎన్నికలయ్యే వరకు ఆయా మండలాల్లోనే మకాం  

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు కీలక నేతలను కేటాయించింది. ఆయా మండలాలను పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించనుంది. ఇటీవల గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను మొత్తం 14 మందికి బాధ్యతలను అప్పగించనుంది. మునుగోడు ప్రచార కమిటీ కన్వీనర్‌ మధుయాష్కీగౌడ్‌ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇంచార్జులుగా బాధ్యతలు తీసుకున్న నాయకులు పూర్తి స్థాయిలో ఆయా మండలాల్లోనే మకాం వేస్తారని, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడి పూర్తయ్యేంతవరకు పర్యవేక్షిస్తారని తెలిపాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top