తెలంగాణ: కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జికి ఘన స్వాగతం.. రెండురోజులు బస.. ఠాక్రే ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌?

Telangana Congress Incharge Manikrao Thakre Arrived Hyd - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్రావ్‌ ఠాక్రే నగరానికి వచ్చారు. బాధ్యతల నేపథ్యంలో ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆసక్తి నెలకొంది.

బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే కు ఘనంగా స్వాగతం లభించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సీనియర్‌ నేత వీహెచ్‌ సైతం ఠాక్రేకు స్వాగతం పలికారు.  రెండు రోజలు పాటు ఆయన ఇక్కడే ఉండి.. పూర్తి పరిస్థితిని సమీక్షించనున్నారు.

సీనియర్లు వర్సెస్‌ రేవంత్‌రెడ్డి పంచాయితీ ముదరడంతో.. గాంధీభవన్‌ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు మాణిక్‌ రావు ఠాక్రేను అధిష్టానం వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన ట్రీట్‌మెంట్‌ ఎలా ఉండబోతుందా? అనే చర్చ మొదలైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top