నేడు సీఎం చేతులమీదుగా ఐఐహెచ్‌టీ ప్రారంభం | Telangana CM To Inaugurate Handloom Institute | Sakshi
Sakshi News home page

నేడు సీఎం చేతులమీదుగా ఐఐహెచ్‌టీ ప్రారంభం

Sep 9 2024 1:07 AM | Updated on Sep 9 2024 1:07 AM

Telangana CM To Inaugurate Handloom Institute

నేతన్నకు చేయూత కింద 36,133 మందికి రూ. 290 కోట్లు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: చేనేత రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సుల్లో శిక్ష ణ ఇచ్చేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నా రు. అలాగే నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ. 290 కోట్లు విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని వ్యవ సాయ, మార్కెటింగ్, సహకార, జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐహెచ్‌టీలో ఏటా 60 మంది విద్యార్థులు చేనేత, జౌళి సాంకేతికతలో మూడేళ్ల డిప్లొమా కోర్సును అభ్యసించడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ డిప్లొమాతో ప్రభుత్వరంగ జౌళి సంస్థలతోపాటు ప్రైవేటు టెక్స్‌టైల్, అపెరల్‌ ఇండస్ట్రీస్, ఫ్యాషన్‌ సెక్టార్‌లలో ఉత్పత్తి, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్‌ విభాగాలలో విద్యార్థులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement