తెలంగాణ ఏఎన్‌ఎం మెరిట్ లిస్ట్ విడుదల | Telangana ANM Merit List 2026 Released Check 1931 Female MPHA Posts Provisional List | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏఎన్‌ఎం మెరిట్ లిస్ట్ విడుదల

Jul 10 2026 11:26 PM | Updated on Jul 10 2026 11:29 PM

Telangana ANM Merit List 2026 Released Check 1931 Female MPHA Posts Provisional List

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) లేదా ఏఎన్‌ఎం (ANM) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సేవలకు వర్తించే వెయిటేజ్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించింది.

ఇంతకుముందు మే 14న పరీక్ష మార్కులు, వెయిటేజ్ మార్కులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసిన బోర్డు.. మే 18 నుంచి మే 22, 2026 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. అందిన అభ్యంతరాలను పరిశీలించి, తగిన మార్పులు చేసిన అనంతరం తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది.

నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించే ఉద్దేశంతో మరోసారి అభ్యంతరాలు స్వీకరించాలని బోర్డు నిర్ణయించింది. తాజా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు జూలై 13 నుంచి జూలై 15 సాయంత్రం 5 గంటల వరకు MHSRB అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుందని, అందువల్ల పూర్తి వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సమర్పించాలని అభ్యర్థులకు బోర్డు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement