‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’ | Telangana CEO Sudarshan Reddy Press Meet Special Intensive Revision | Sakshi
Sakshi News home page

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

Jul 10 2026 5:55 PM | Updated on Jul 10 2026 6:06 PM

Telangana CEO Sudarshan Reddy Press Meet Special Intensive Revision

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ‘సర్‌’ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 98 శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ జరిగిందని.. ఈనెల 24వ తేదీ వరకు పత్రాల డిజిటల్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ రాకపోతే ఆగష్టులో ఫామ్ 6, 8 ఇస్తారని.. నింపి ఇవ్వాలన్నారు.

‘సర్‌’ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుంది. కొత్త ఓటర్ నమోదు చేసుకుంటే నెల రోజుల్లో ఈసీఐ ఇస్తుంది. ఓటు ఉండి.. ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే బీఎల్‌వోను సంప్రదించాలి. తెలంగాణలో తప్పుడు వివరాలు ఉన్న ఓటర్లు అనామాలీస్ 89 లక్షలు ఈసీఐ గుర్తించింది. త్వరలో అక్షర దోషాలు ఉన్న అనామాలీస్ ఓటర్లకు ఎలక్షన్ కమిషన్‌ నోటీసులు ఇస్తుంది’’ అని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.

రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతీ ఒక్కరికీ ముఖ్యమైనది. ఓటర్ సవరణ నిరంతరం జరిగే ప్రక్రియ. ఎన్నికలకు ముందు జరిగే స్పెషల్ సమ్మరి రివిజన్ జరిగేది. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఓటర్ ప్రక్షాళన చేయాలని ఈసీఐ నిర్ణయం తీసుకుంది. ‘సర్‌ ప్రక్రియ రెండు భాగాలుగా జరుగుతుంది. ‘సర్‌’ ప్రక్రియ పూర్తయ్యాక రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష పడుతుంది. డీఎస్‌ఏ సాఫ్ట్‌వేర్ ద్వారా దేశ వ్యాప్తంగా రెండు ఓట్లపై ప్రక్షాళన చేస్తారు. 2002 డేటా లేకపోతే ఆ ఓటర్లకు నోటీసులు ఇచ్చి ప్రత్యేక సర్వే జరుగుతుంది. ఏజెన్సీ ఏరియాల్లో 59 శాతం ఫామ్స్ నింపి తిరిగి ఇచ్చారు. ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గంలో ఫామ్స్ అందాయి. డిజిటలైజేషన్ జరుగుతుంది. ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు ఇస్తారా? లేదా? ప్రభుత్వం నిర్ణయం’’ అని  సుదర్శన్‌రెడ్డి చెప్పారు.

 కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్
‘సర్‌’ 2026 పురోగతిపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన సమీక్ష జరిగింది. తెలంగాణ నుంచి పాల్గొన్న సీఈవో సుదర్శన్ రెడ్డి, డీఈవోలు, ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు హాజరయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ వేగవంతం చేయాలని కేంద్రం ఈసీఐ ఆదేశించింది. హైదరాబాద్‌లో డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చింది.

రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డిజిటైజేషన్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం.. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొంది. రోజువారీ డిజిటైజేషన్ లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఇతర జిల్లాలు అమలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ లక్ష్యాలను నిశితంగా పర్యవేక్షించాలని తెలంగాణ సీఈవోను ఆదేశించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement