ఇంటింటా చదువుల ‘క్రాంతి

Teacher Lessons For Students Who Do Not Have Online Facility - Sakshi

ఆన్‌లైన్‌ సౌకర్యం లేని విద్యార్థులకు ఉపాధ్యాయురాలి పాఠాలు

గజ్వేల్‌/ములుగు: కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు వినలేని విద్యార్థులకు ఓ ఉపాధ్యాయురాలు ఇంటింటికీ వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. జాయ్‌ఫుల్‌ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్, లో–కాస్ట్, నో–కాస్ట్‌ టీఎల్‌ఎమ్‌ పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నారు. ‘పాఠశాలే నాకు లోకం. నిత్యం పిల్లలతో విద్యాబోధనలో గడపటమే నాకు ఇష్టం. అందుకే సెలవున్నా...పాఠశాలకు రావడం మర్చిపోను’అంటున్న ఆ ఉపాధ్యాయురాలు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎం.క్రాంతికుమారి. 130 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలకు తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన క్రాంతికుమారి మొదట్నుంచీ తన పనితీరుతో ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌ మినహా మిగతా అన్ని రోజుల్లో యథాతథంగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తను బోధించే ఐదో తరగతిలోని 35 మంది విద్యార్థుల్లో సగం మందికిపైగా స్మార్ట్‌ ఫోన్‌లు లేకపోవడంతో ఆమె వారి ఇంటికి వెళ్లి పాఠాలు చెప్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు రూ.5 లక్షల చెక్కును క్రాంతికుమారికి అందజేశారు. ఈ నిధులతో పాఠశాల కార్పొరేట్‌ సొబగులను అద్దుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top