స్పా సెంటర్‌లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్ | Task Force Police Raids On SPA Center At Gudimalkapur | Sakshi
Sakshi News home page

స్పా సెంటర్‌లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్

Jan 7 2024 8:48 AM | Updated on Jan 7 2024 10:52 AM

Task Force Police Raids On SPA Center At Gudimalkapur  - Sakshi

స్పా సెంటర్ పేరుతో..చీకటి దందా..

హైదరాబాద్: మసాజ్‌ పేరుతో అక్రమంగా కొనసాగిస్తున్న స్పా కేంద్రాలపై గుడిమల్కాపూర్‌ పోలీసులు, సౌత్‌వెస్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ ముజీబ్‌ ఉర్‌ రెహా్మన్‌ తెలిపిన వివరాల ప్రకారం..  నానల్‌నగర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జన్నత్, గోల్డెన్‌ అనే రెండు స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు స్పా కేంద్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. స్పా, స్నూకర్, రిక్రియేషన్‌క్లబ్‌లకు ఇళ్లను అద్దెకిచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఇళ్ల నిర్వహకులకు ఇన్‌స్పెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement