ముఖరా(కె) సర్పంచ్‌కు ‘స్వచ్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌’ | Swachh Sujal Shakti Samman Award to Mukhara K Sarpanch | Sakshi
Sakshi News home page

ముఖరా(కె) సర్పంచ్‌కు ‘స్వచ్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌’

Published Sun, Mar 5 2023 5:28 AM | Last Updated on Sun, Mar 5 2023 5:29 AM

Swachh Sujal Shakti Samman Award to Mukhara K Sarpanch - Sakshi

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కే) సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి ‘స్వచ్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌–2023’ అవార్డును అందుకున్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ్‌ భారత్‌ గ్రామీణ్‌ విభాగంలో కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మీనాక్షికి ఈ అవార్డును అందించారు. 220 ఇళ్లు ఉన్న ముఖరా(కె) గ్రామం ఓడీఎఫ్‌ ప్లస్‌ కేటగిరీలో చోటుదక్కించుకుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తమ గ్రామాభివృద్ధి వివరాలను మీనాక్షి వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement