హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Supreme Court Green Signal To Hyderabad Ganesh Immersion - Sakshi

సాక్షి, ఢిల్లీ: హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి  అడ్డంకులు తొలిగాయి. ఈ ఏడాది  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. (చదవండి: సైదాబాద్‌ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య

ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ అన్నారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు.  వచ్చే ఏడాది ఈ ఆర్డర్‌ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు.

హైదరాబాద్‌ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసు అని సీఐజే అన్నారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రపరిచేందుకు, సుంద‌రీక‌ర‌ణ‌కు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. 22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేశామని, కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.
చదవండి:
టికెట్‌ తీసి సాధారణ ప్రయాణికుడిలా..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top