ఏసీబీ వలలో ఎస్సారెస్పీ ఉద్యోగులు | Srsp employees caught by the Anti Corruption Bureau officials | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఎస్సారెస్పీ ఉద్యోగులు

Apr 24 2025 3:30 AM | Updated on Apr 24 2025 3:30 AM

Srsp employees caught by the Anti Corruption Bureau officials

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ఎస్సారెస్పీ డివిజన్‌–6 కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌బాబు, సీనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌లు బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ డివిజన్‌– 6లో రికార్డ్‌ అసిస్టెంట్‌ యాజాజ్‌ ఉల్‌ఖాన్‌ అనారోగ్యానికి గురై గతేడాది ఆగస్టు 5 నుంచి అక్టోబర్‌ 31వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. 

ఆరోగ్యం కుదుట పడ్డాక నవంబర్‌ 1న విధుల్లో చేరారు. ఇందుకు సంబంధించిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కూడా సమర్పించారు. సెలవు కాలానికి సంబంధించిన వేతనం చెల్లించకుండా శ్రీధర్‌బాబు, సురేశ్‌లు 6 నెలలుగా యాజాజ్‌ ఉల్‌ ఖాన్‌ను వేధిస్తున్నారు. ఇదేమిటని బాధితుడు ప్రశ్నిస్తే.. రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశారు.

దీంతో యాజాజ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు బాధితుడు సదరు అధికారులకు కార్యాలయంలో డబ్బు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టుకు తరలించారు.

బిల్లులతో సంబంధం లేని ఉద్యోగి
సీనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌కు బిల్లుల చెల్లింపులతో సంబంధమే లేదు. అయినా.. అందులో తలదూర్చి బిల్లులు క్లియర్‌ చేయకుండా చిరుద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 

Advertisement
 
Advertisement
Advertisement