ఉప్పల్‌ స్టేడియానికి క్రీడామంత్రి.. వారందరికీ ఉచితంగా మ్యాచ్‌ చూసే అవకాశం

Sports ministry Gifted Match Tickets to those Injured in Stampede - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రీడా అభిమానుల జీవితాలతో ఆటలు ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. టికెట్లు గోల్‌మాల్‌పై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులతో కలిసి మంత్రి ఉప్పల్‌ స్టేడియానికి వచ్చారు.

గాయపడిన క్రీడాభిమానులందరికీ బాక్స్‌ టికెట్లు ఇచ్చి ఈ రోజు మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ నవీనను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఆమెకు క్రీడా శాఖ తరపున ప్రమోషన్‌ ఇవ్వడంతోపాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డీజీపీకి కూడా లెటర్‌ రాశామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. 

చదవండి: (India Vs Australia: బ్లాక్‌ దందా.. రూ.850 టికెట్‌ రూ.11,000)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top