India vs Australia: Black Tickets Gang Arrested By Police - Sakshi
Sakshi News home page

India Vs Australia: బ్లాక్‌ దందా.. రూ.850 టికెట్‌ రూ.11,000

Sep 25 2022 4:48 PM | Updated on Sep 25 2022 8:58 PM

India vs Australia: Black Tickets Gang Arrested by Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియం సమీపంలో బ్లాక్‌ టికెట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేడియంకు సమీపంలో టికెట్లను విక్రయిస్తున్న గగులోత్‌ వెంకటేష్‌, ఇస్లావత్‌ దయాకర్‌, గగులోత్‌ అరుణ్‌ అనే ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.850 విలువ చేసే టికెట్‌ను రూ.11,000కి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు టికెట్లు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఉప్పల్‌ పోలీసులు వాటికి ఎస్‌ఓటీ పోలీసులకు అప్పగించారు.

ఆదివారం సెలవు దినం కావడం.. సిరీస్‌ను తేల్చే మ్యాచ్‌ కావడం.. మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం రావడంతో టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే మ్యాచ్‌ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని అభిమానులు మ్యాచ్‌ను ఎలాగైనా చూసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తుండటంతో బ్లాక్‌ ముఠా తమ దందాను కొనసాగిస్తోంది.

చదవండి: (భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement