అశ్వారావుపేట రూరల్: సంక్రాంతి పండుగ వేళ పలు ప్రాంతాల్లో కోడి పందేలు హోరాహోరీగా జరుగుతాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండువారిగూడెంలో ఓ రైతు పలు రకాల కోడి పుంజులను విక్రయానికి పెంచుతున్నాడు. ఖాళీగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వందల సంఖ్యలో పందెం పుంజులు పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం. పొలం చుట్టూ కంచెకు గ్రీన్‌షీట్‌తో చాటు కట్టి.. ఇనుప కడ్డీలతో చేసిన గంపల కింద పుంజులను కాపాడుతున్నాడు. ఎండ, వాన తగలకుండా తాటి ఆకులను రక్షణగా పెట్టాడు.


