రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు 300 మందిని నయం చేశా

Singareni Retired Worker Giving Medicine To Corona In Mancherial - Sakshi

కరోనాకు మందు ఇస్తున్న సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు 

శాస్త్రీయత లేదు.. నమ్మి మోసపోవద్దు: సీఐ

సాక్షి, మందమర్రి రూరల్‌: ‘ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు మూడొందల మందిని నయం చేశా’అంటున్నాడు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు బచ్చలి భీమయ్య. మందమర్రిలో మరో ఆనందయ్య.. కరోనా బాధితులకు ఆయుర్వేదం మందు అందిస్తూ బాగు చేస్తున్నాడంటూ బుధవారం సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌ అయింది.

పట్టణంలోని మారుతినగర్‌లో నివాసం ఉంటున్న భీమయ్య.. తన తాత దగ్గర వనమూలికల వైద్యం గురించి తెలుసుకున్నానని చెప్పాడు. దగ్గు, దమ్ము ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వన మూలికలతో తయారుచేసిన మందు కరోనా బాధితులకు బాగా పనిచేస్తుందని, రెండు గంటల్లో నయం అవుతుందని పేర్కొన్నాడు. ఉచితంగానే ఈ మందు అందిస్తున్నానని తెలిపాడు. కాగా, భీమయ్య అందించే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని మందమర్రి సీఐ ప్రమోద్‌రావు చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోవద్దని సీఐ కోరారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top