సీఎం రేవంత్ గ్రామంలో శంకరనేత్రాలయ కంటి శిబిరం | Shankar Nethralaya eye camp in CM Revanths village Kondareddypalli | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్ గ్రామంలో శంకరనేత్రాలయ కంటి శిబిరం

May 4 2025 3:01 PM | Updated on May 4 2025 3:21 PM

Shankar Nethralaya eye camp in CM Revanths village Kondareddypalli

కొండారెడ్డిపల్లి:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన,  కొండారెడ్డి పల్లి లో వారి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం శంకరనేత్రాలయ సంస్థ ఇటీవల ఉచిత కంటి  వైద్య శిభిరాన్ని నిర్వహించింది. ఇది తెలంగాణాలో శంకరనేత్రాలయ సంస్థ నిర్వహించిన ఇరవయ్యోవ  కంటి శిబిరం.

శంకరనేత్రాలయ అమెరికా అధ్యక్షులు  బాలారెడ్డి ఇందుర్తి  పటిష్ట నాయకత్వంలో,  రేవంత్ రెడ్డి సోదరులు  ఎనుముల కృష్ణ రెడ్డి  ప్రోత్సాహంతో ఎంతో విజయవంతంగా జరిగిన ఈ కార్యక్రమలో, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఇందుర్తి గణపతి రెడ్డి  కూడా కీలక పాత్ర పోషించారు. ఈ  సందర్బంగా ముఖ్యమంత్రి  రేవంత్ శంకరనేత్రాలయ సంస్థకు, మరియు ఈ కార్యక్రమంలో సహాయం అందించిన ప్రతీ ఒక్కరిని అభినందించారు.  

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ శిభిరంలో 1888 మంది రోగులను పరీక్షించి 184 మందికి కంటి శుక్ల వ్యాధులు నివారణ శస్త్ర చికిత్సాలు అక్కడికక్కడే, శంకరనేత్రాలయ వారి ప్రత్యేకంగా నిర్మించిన, మొబైల్ ఆపరేషన్ బస్సులలో విజయవంతంగా నిర్వహించారు.  ఎనుముల రాజశేఖర్ రెడ్డి, ఎనుముల  వేమా రెడ్డి ఎంతో  సమర్ధవంతంగా ఈ వైద్య శిభిరాన్ని నిర్వహించి, ఉచిత భోజన సదుపాయాన్ని కూడా అందించారు.  

ఎంతో విజయవంతంగా జరిగిన ఈ శిభిరానికి మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్  అధ్యక్షులు  డాక్టర్ గిరీష్ రావు గారు, శంకరనేత్రాలయ అమెరికా కార్య నిర్వాహక వర్గ సభ్యులైన  శ్యామ్ అప్పాలి , మూర్తి రేకపల్లి  ,  వంశీ ఏరువరం , శంకరనేత్రాలయ హౌస్టన్ ట్రస్టీ  నారాయణ రెడ్డి ఇందుర్తి  తమ పూర్తి సహాయ సహకారాలను అందించారు. వారికి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

అంకితభావంతో పదిరోజుల పాటు జరిగిన ఈ శిభిరాన్ని, పలువురు ప్రముఖులు సందర్శించి, శంకరనేత్రాలయ సిబ్బందిని అభినందించారు. పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , తెలంగాణా పశుసంవర్ధక శాఖ చైర్మన్  గుత్తా అమిత్ రెడ్డి , తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సంఘ అధ్యక్షులు  కే వి ఎన్ రెడ్డిగారు, తెలంగాణా అకాడెమీ అఫ్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) సి ఈ ఓ , రాఘవేందర్ సుంకిరెడ్డి, అనూష ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ జలంధర్ రెడ్డి  ఈ శిభిరాన్ని సందర్శించి, శంకర నేత్రాలయం వారు చేస్తున్న సేవలను కొనియాడారు.

కొండారెడ్డి పల్లి, మరియు  పరిసర ప్రాంత  గ్రామ ప్రజలు, శంకరనేత్రాలయ  సంస్థ అందించిన సేవలు ఎంతో  విలువయినవని, తమ జీవితాలలో సరికొత్త వెలుగు నింపిందని, తమ కృతజ్ఞతలు  తెలియజేశారు.  గతంలో మాచారం, అచంపేట్ ,  డిండిచింతపల్లి, పోల్కంపల్లి,  వెల్దండ, ఆమనగల్, నంది వడ్డేమాన్ గ్రామాలలో నిర్వహించిన కాంపుల ద్వారా  కూడా ఏంతో మంది లబ్ది పొందడం జరిగింది.  భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసి పేదవారిని ఆదుకోవాలని, ప్రభుత్వపరంగా కూడా సంకరనేత్రాలయ సంస్థ చేస్తున్న ఈ ప్రజాహిత కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement