మాకు కావాలో రైలు | Secunderabad Danapur Train Demand Shortage Passengers Problems | Sakshi
Sakshi News home page

మాకు కావాలో రైలు

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 11:52 AM

Secunderabad Danapur Train Demand Shortage Passengers Problems

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌నకు ఒక్కటే రెగ్యులర్‌ రైలు అందుబాటులో ఉంది.  హైదరాబాద్‌ నుంచి పాటా్న, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య తదితర ప్రాంతాలకు సైతం డిమాండ్‌కు తగిన సర్వీసులు లేకుండాపోయాయి. దీంతో బిహార్, ఉత్తరాది ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది వలస కారి్మకులతో పాటు భక్తులు, తీర్థయాత్రలకు వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బెర్తులన్నీ 2 నెలల క్రితమే భర్తీ అయ్యాయి. వేసవిలో కాకుండా ఏడాది పొడవునా రద్దీ ఉండే సికింద్రాబాద్‌– వారణాసి– పటా్న, హైదరాబాద్‌– దర్భంగా రూట్లలో రెగ్యులర్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అది కార్మికుల రైలు..
సికింద్రాబాద్‌– దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12791/12792)ను కారి్మకుల రైలుగా పరిగణిస్తారు. ప్రతిరోజు ఉత్తరాదికి రాకపోకలు సాగించే కారి్మకులంతా ఈ రైలుపైనే ఆధారపడి ప్రయాణిస్తున్నారు. స్లీపర్, ఏసీ బెర్తులు పూర్తిగా భర్తీ అయ్యాయి. కేవలం 75 మంది కూర్చొని ప్రయాణించేందుకు అవకాశం ఉండే జనరల్‌ బోగీల్లో 150 నుంచి 200 మంది స్టాండింగ్‌ జర్నీ చేయాల్సి వస్తోంది. చివరకు టాయిలెట్లలో కూడా నించొని వెళ్లాల్సి వస్తోందని పట్నాకు చెందిన రాజు ఓజా తెలిపారు. మరోవైపు చర్లపల్లి– దర్భంగా మధ్య నడిచే బై వీక్లీ(17007/17008) అందుబాటులో ఉన్నప్పటికీ ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్‌లకు చెందిన వలస కారి్మకులంతా ఈ రైలులోనే రాకపోకలు సాగిస్తారు. ఇది వారానికి రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటంతో సాధారణంగా 3 నెలలు ముందే రిజర్వేషన్లు భర్తీ అవుతున్నాయి.  

జూన్‌లో యమునా పుష్కరాలు..  
జూన్‌ 2వ తేదీ నుంచి 13 వరకు జరగనున్న యమునా పుష్కరాల దృష్ట్యా ఈ రూట్‌లో రైళ్లకు మరింత డిమాండ్‌ నెలకొంది. దానాపూర్, దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లతోపాటు వారానికి ఒక్కరోజు చర్లపల్లి–ముజఫర్‌పూర్‌ మధ్య నడిచే అమృత్‌ భారత్‌(15294/15293)కు సైతం డిమాండ్‌ పెరిగింది. ముజఫర్‌పూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement