Research: కోవిడ్‌ తీవ్రతకు ఆ డీఎన్‌ఏకు లంకె!

Scientific Research Journal Says Covid Symptoms May Effects On DNA - Sakshi

దానివల్లే 50 శాతం మంది దక్షిణాసియావాసులపై తక్కువ ప్రభావం  

అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారినపడిన కొందరిలో తీవ్రమైన లక్షణాలు కన్పిస్తున్నాయి ఎందుకు? ఈ ప్రశ్నకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానం కనుగొంది. యూరోపియన్లపై జరిగిన ఓ పరిశోధనలో డీఎన్‌ఏలోని ఒక భాగానికి, కోవిడ్‌ తీవ్రతకు, ఆస్పత్రిలో గడిపే అవసరానికి సంబంధం ఉందని తేలింది. ఈ డీఎన్‌ఏ భాగం 50 శాతం మంది దక్షిణాసియావాసుల్లో ఉండగా.. 16 శాతం మంది యూరోపియన్లలో ఉంది.

ఈ డీఎన్‌ఏ భాగం కోవిడ్‌–19 బాధితులపై చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్‌ డాక్టర్‌ తంగరాజ్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబేతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు నిర్వహించింది. యూరోపియన్లలో తీవ్రస్థాయి లక్షణాలకు కారణమవుతున్న కోవిడ్‌–19 రూపాంతరితాల ప్రభావం దక్షిణాసియావాసులపై పెద్దగా లేనట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ‘యూరోపియన్లు, దక్షిణాసియా జన్యు సమాచారం ఆధారంగా ఇరువర్గాల్లోని ఇన్‌ఫెక్షన్, మరణాల రేటును పోల్చి చూశాం. కరోనా ప్రబలిన కాలంలో మూడుసార్లు ఈ పరిశీలన జరిగింది. భారత్, బంగ్లాదేశ్‌లోని వారిపై ఎక్కువగా దృష్టి సారించాం’అని డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు.

దక్షిణాసియా ప్రజల జన్యుమూలాలు ప్రత్యేకమైనవని ఈ అధ్యయనం మరోసారి రుజువు చేసిందని, దక్షిణాసియా జనాభా మొత్తానికి, కోవిడ్‌కు ఉన్న లింకులపై జన్యుక్రమం స్థాయిలో విస్తృత పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి తొలి రచయితగా ఉన్న ప్రజీవల్‌ ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. 

బంగ్లాదేశ్‌లో భిన్న ప్రభావాలు.. 
బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్‌ గిరిజన తెగలపై ఒక రకమైన ప్రభావం చూపితే కొన్ని కులాల ప్రజలపై ఇంకో రకమైన ప్రభావం చూపిందని తమ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జార్జ్‌ వాన్‌ డ్రీమ్‌ తెలిపారు. జన్యుక్రమం మొదలుకొని రోగ నిరోధక వ్యవస్థ, జీవనశైలి వంటి అనేక అంశాలు కరోనా బారినపడే అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు ఇటీవల సేకరించిన సమాచారం చెబుతోందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ నందికూరి వినయ్‌ తెలిపారు.
చదవండి: అమెరికాకు వచ్చే విద్యార్థులకు కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ మస్ట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-06-2021
Jun 12, 2021, 14:09 IST
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ఆదాయం పెరగటంలేదు... కానీ పెరిగిన నిత్యావసరాల ధరలు మాత్రం పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.....
12-06-2021
Jun 12, 2021, 12:36 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందన్న మాట నిజమేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  శనివారం పేర్కొన్నారు. కరోనా కేసులు...
12-06-2021
Jun 12, 2021, 11:57 IST
భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్‌(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల...
12-06-2021
Jun 12, 2021, 08:43 IST
మీర్‌పేట (హైదరాబాద్‌): టీకా తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్‌పేట రాఘవేంద్రనగర్‌ కాలనీలో చోటు...
12-06-2021
Jun 12, 2021, 08:30 IST
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆమె కామాంధుల బాధితురాలన్న కనికరంలేదు.. ఆమెకు కరోనా సోకిందన్న దయ లేదు.. ఆమెను తండావాసులు నిర్దాక్షిణ్యంగా వెలివేశారు. చుట్టూ...
12-06-2021
Jun 12, 2021, 08:13 IST
పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్‌  సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీలవారికే వ్యాక్సిన్లు వేస్తుండటంతో జనం...
12-06-2021
Jun 12, 2021, 05:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌...
12-06-2021
Jun 12, 2021, 05:17 IST
ఆపద కాలం ఉంటుంది. కానీ ఆదుకోలేని కాలం ఒకటి ఉంటుందని మొదటిసారిగా చూస్తున్నాం. ఒక కోడలు.. అపస్మారక స్థితిలో ఉన్న...
12-06-2021
Jun 12, 2021, 04:43 IST
కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర...
12-06-2021
Jun 12, 2021, 04:30 IST
కరోనా పుట్టుక.. బ్యాడ్‌ బ్యాట్స్‌.. అందరి దృష్టి గబ్బిలాల మీదే ఎందుకంటే!
12-06-2021
Jun 12, 2021, 03:54 IST
సాక్షి, అమరావతి: ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు వేగంగా ఫలితాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 చోట్ల...
11-06-2021
Jun 11, 2021, 18:55 IST
సాక్షి,అమరావతి: ఆందధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గాయి.. యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. ప్రస్తుతం ఏపీలో 96,100 యాక్టీవ్...
11-06-2021
Jun 11, 2021, 17:54 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి కరోనా పాజిటివ్‌గా...
11-06-2021
Jun 11, 2021, 14:48 IST
సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా వైరస్‌ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె మీద ఈ కేసు...
11-06-2021
Jun 11, 2021, 11:03 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్రం‍లో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో పదిరోజుల పాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం...
11-06-2021
Jun 11, 2021, 10:51 IST
దేశీయ పార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌కు అమెరికాలో భారీ షాక్‌  తగిలింది.  సంస్థ అభివృద్ది చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌...
11-06-2021
Jun 11, 2021, 10:18 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 91,702 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
11-06-2021
Jun 11, 2021, 09:35 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చూస్తే జార్ఖండ్‌ రాష్ట్రంలోనే అత్యధికంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు వృథా అయినట్లు వెల్లడైంది. కోవిడ్‌ టీకా డోస్‌లను...
11-06-2021
Jun 11, 2021, 09:20 IST
సాక్షి,హైదరాబాద్‌: ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కు తప్పనిసరి. కరోనా బారినపడకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాసు్కలు ధరిస్తున్నారు. చాలాసేపు మాస్కు ధరించడం...
11-06-2021
Jun 11, 2021, 08:40 IST
సాక్షి, జగిత్యాల: లాక్‌డౌన్‌ సడలింపులతో జిల్లాలో జనజీవనం సాధారణమైంది. ఉదయం నుంచే రోడ్లు జనసమర్థంగా మారాయి. బుధవారం ఉదయం 6...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top