6 నుంచి లాసెట్‌ దరఖాస్తులు

Schedule For TS LAWCET And PGLCET Released - Sakshi

6 నుంచి లాసెట్‌ దరఖాస్తులు 

షెడ్యూల్‌ విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: మూడు, ఐదేళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 6 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లు పంపవచ్చని చెప్పారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500, మిగతావారికి రూ.800గా నిర్ణయించారు.

పీజీ లాసెట్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.800, మిగతావారికి రూ.1,000 ఉంటుంది. ఈ కార్యక్రమంలో మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top