‘సాక్షి’ సెలబ్రేషన్‌ ఆఫర్‌: అరకిలో గోల్డ్‌ విజేత శ్రీనివాస్‌రెడ్డి

Sakshi Celebration Offer: Srinivas Reddy Wins Half KG Gold Price

సాక్షి సెలబ్రేషన్స్‌ ఆఫర్‌కు విశేష స్పందన

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి సెలబ్రేషన్స్‌ ఆఫర్‌ అరకిలో బంగారం విజేతగా ప్రకాశం జిల్లాకు చెందిన కాశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నిలిచారు. గోల్డ్‌ప్రైజ్‌ రావడం చాలా ఆనందంగా ఉందని, అందుకు సాక్షికి కృత జ్ఞతలు తెలియచేశారు. ఇటీవలె తనకు ఆడపిల్ల పుట్టిందని ఈ బంగారాన్ని ఆమెతోపాటు ,తన భార్యకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాక్షి ఇచ్చే కథనాలంటే తనకు బాగా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షి డైరెక్టర్లు, సీఈవో చేతుల మీదుగా అరకిలో బంగారాన్ని  అందుకున్నారు. పాఠకులను ప్రోత్సహించే క్రమంలో సాక్షి యాజమాన్యం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. చదవండి.. గెలవండి అనే నినాదంతో సాక్షి నిర్వహించిన ఈ సెలబ్రేషన్‌ ఆఫర్‌కు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన సాక్షి పాఠకులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. వారిలో 20,083 మంది విజేతలుగా నిలిచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top