
జగిత్యాల డిపోలో ప్రయాణికులకు పంపిణీ
జగిత్యాలటౌన్: ఆ కీచైన్ స్కాన్ చేయగానే..ఆర్టీసీ ప్రయా ణ సమాచారం తెలుస్తుంది. తాము ఎక్కా ల్సిన బస్ ఎక్కడుందో తెలియజేసే గమ్యం యాప్ తోపాటు అఫీషియల్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సహా పది రకాల సేవలు ఇందులో ఉన్నాయి. జగిత్యాల డిపోలో ఐదు రోజుల క్రితం డిపో మేనేజర్ క్యూఆర్‌కోడ్ ఉన్న కీ చైన్‌లను ప్రయాణికులకు పంపిణీ చేశారు. దీంతో ప్రయాణం మరింత సులభతరం అయ్యిందని ప్రయాణికులు చెబుతున్నారు. మర్యాద వారోత్సవాల్లో భాగంగా వీటిని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు అందజేస్తున్నారు.
కీచైన్‌ను వినియోగించే విధానం
స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే సెర్చ్‌బార్ పక్కన కెమెరా గుర్తు చూపిస్తుంది. దానిని ప్రెస్ చేయగానే గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు కీచైన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆర్టీసీకి సంబంధించిన పది రకాల సేవల యాప్‌లు, వెబ్‌సైట్లు కనిపిస్తాయి. అందులో ప్రయాణికుడికి కావాల్సిన సమాచారం ఎంచుకొని వినియోగించుకోవచ్చు.
సౌకర్యవంతంగా ఉంది
ఉద్యోగరీత్యా తరచూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తా. కీచైన్ క్యూఆర్‌కోడ్ చాలా సౌకర్యవంతంగా ఉంది. గమ్యం యాప్‌లో బస్సు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చిందనే వివరాలతోపాటు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యంలాంటి పలు సేవలు ఉన్నాయి. – అల్లె రాజేందర్, ప్రభుత్వ ఉద్యోగి, జగిత్యాల
ప్రయాణికుల నుంచి మంచి స్పందన
సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన క్యూఆర్‌కోడ్ కీచైన్ సేవలపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ఇది ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – కల్పన, డిపో, మేనేజర్ జగిత్యాల