ఎయిర్‌గన్‌తో వ్యక్తి హల్‌చల్

అదుపులోకితీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు
సాక్షి, శంషాబాద్: కొంతకాలంగా ఎయిర్‌గన్‌తో హల్‌చల్ చేస్తూ స్థానికులను బెదిరిస్తున్న ఓ వ్యక్తిని ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని తొళ్లబస్తీకి చెందిన సోహైల్(22) గత కొన్ని రోజులుగా తుపాకీ వెంట పెట్టుకొని సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నానని స్థానికులను బెదిరిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సున్నంబట్టి సమీపంలో కొందరు వ్యాపారులను మామూళ్లు ఇవ్వాలంటూ బెదిరించడంతో వారు ఆర్‌జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సోహైల్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తుపాకీని పరిశీలించగా ఎయిర్‌గన్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: పీపీఈ కిట్‌తో వ్యక్తి హల్‌చల్.. పరుగో పరుగు
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి