‘మహాప్రస్థానం’ అనువాదకుడు సుబ్బారాయుడు కన్నుమూత

సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత శ్రీశ్రీ రచించిన ‘మహా ప్రస్థానం’ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన రిటైర్డ్ ఆంగ్ల లెక్చరర్ వడ్డీ సుబ్బారాయుడు (84) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.
ఆయన కడప ఆర్ట్స్ కాలేజీలో ఆంగ్ల లెక్చరర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. సుబ్బారాయుడు అంత్యక్రియలను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు డాక్టర్ వి.సూర్యప్రకాశ్ తెలిపారు. సుబ్బారాయుడు పలు తెలుగు కథలను ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రశంసలు పొందారు.