అయ్యగారూ! అభినందనలు | Repairs to Mutyalamma Kunta embankment | Sakshi
Sakshi News home page

అయ్యగారూ! అభినందనలు

Oct 9 2024 4:13 AM | Updated on Oct 9 2024 4:13 AM

Repairs to Mutyalamma Kunta embankment

‘సాక్షి’ కథనానికి స్పందించిన పురోహితుడు 

ముత్యాలమ్మ కుంట కట్టకు మరమ్మతులు

కురవి: మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలోని ముత్యాలమ్మ కుంట కట్టపై గుడికి వెళ్లేందుకు నిర్మించిన సీసీరోడ్డు కిందిభాగం ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురికాగా మరమ్మతు చేపట్టారు. కాగా, గత నెల 24న ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘కర్ర జారిందా..ప్రాణం గోవిందా’అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి గ్రామ పురోహితుడు బుక్కామఠం వీరన్న స్పందించారు. 

మంగళవారం తన సొంత ఖర్చులతో మొరం పోయించి జేసీబీ సాయంతో చదును చేయించారు. అలాగే కట్టకింద ధ్వంసమైన బీటీరోడ్డు మరమ్మతులు చేయించారు. కాగా సీసీరోడ్డు కిందిభాగం కోతకు గురై నెలరోజులు దాటినా అధికారులెవరూ స్పందించలేదని..అయ్యగారు మరమ్మతులు చేయించడం అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement