ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది

Raised as Hindu For 15 years Girl Discovers Family Muslim - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత పదిహేనేళ్లుగా సాకినా తప్పిపోయిన తన బిడ్డ ఫాతిమాను తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. రెండున్నరేళ్ల వయసులో తప్పిపోయిన తన కుమార్తె.. ప్రస్తుతం ఎక్కడుందో.. ఎలా ఉందో.. అసలు బతికి ఉందో లేదో అనే ఆలోచన ఆ తల్లి గుండెని పిండేసేది. ఎక్కడో ఒక చోట తన బిడ్డ క్షేమంగా ఉండాలని అల్లాను ప్రార్థించేది. ఆమె మొర ఆలకించిన దేవుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత వారి గుండెకోతను దూరం చేశాడు. చివరకు కుమార్తెని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. దాదాపు 16 ఏళ్ల క్రితం కర్నూలుకు చెందిన ఫాతిమా తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. మక్కా మసీదు సందర్శనలో ఉండగా.. తప్పిపోయింది. అప్పటి నుంచి వెతుకుతుండగా..16 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఓ చిల్డ్రన్‌ హోంలో తనను గుర్తించారు. ప్రస్తుతం ఆమెని కుటుంబం వద్దకు చేర్చారు.  

అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఫాతిమా.. ఆ తర్వాత 15 ఏళ్లు హోంలో స్వప్న పేరుతో హిందువుగా పెరిగింది. ఆమె ప్రస్తుతం తన కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతుంది. ఈ సందర్భంగా ఫాతిమా అలియాస్‌ స్వప్న సోదరుడు అబిద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది ఓ ఉద్వేగభరిత సన్నివేశం. మేం ఫాతిమాను మా ఇంటికి తీసుకెళ్లి.. బంధువులు, స్నేహితులకు పరిచయం చేస్తాం. ఆ తర్వాత ఆమెను తిరిగి హోంకు పంపిస్తాం. తన చదువును కొనసాగిస్తుంది’ అని తెలిపాడు. 
(చదవండి: 16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బాలిక!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top