కాంగ్రెస్‌ నేత శివసేనారెడ్డిని పరామర్శించిన రాహుల్‌గాంధీ | Rahul Gandhi Meets Telangana Youth Congress President Shiv Sena Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేత శివసేనారెడ్డిని పరామర్శించిన రాహుల్‌గాంధీ

Aug 8 2021 10:44 AM | Updated on Aug 8 2021 10:49 AM

 Rahul Gandhi Meets Telangana Youth Congress President Shiv Sena Reddy  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డిని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ పరామర్శించారు. పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు, పెగాసస్‌ స్పైవేర్‌ గూఢచర్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఇటీవల ఢిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో నిర్వహించిన పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమంలో శివసేనారెడ్డి గాయపడిన విషయం తెలిసిందే.

మోకాలు ఫ్రాక్చర్‌ కావడంతో చికిత్స తీసుకున్న ఆయనను యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యాలయంలో రాహుల్‌ ప్రత్యేకంగా కలిసి ఘటన జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. తనకు అండగా ఉంటానని రాహుల్‌ భరోసానిచ్చారని శివసేనారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement