Prashant Kishore: టీ కాంగ్రెస్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ టెన్షన్‌

Prashant Kishore Tension In Congress - Sakshi

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కలిసి పనిచేయడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్‌కు స్నేహం హస్తం అందిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో పనిచేయడానికి పీకే సుముఖత వ్యక్తం చేయడం టీ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది.

దీనిపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీ కాంగ్రెస్‌ నేతలు హైకమాండ్‌ చెప్పిందే శిరోధార్యమని చెబుతున్నప్పటికీ పీకే విషయం మాత్రం వారికి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకుంటామని టీ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే స్పష్టం చేయగా,రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌తో పీకే కలయికను ఉద్దేశించి ఆయన ట్వీట్లు చేస్తున్నారు. ‘నీ యొక్క శత్రువుతో ఎవరైతే స్నేహం చేస్తారో వారిని ఎప్పుడూ నమ్మలేం’, అని ఒక ట్వీట్‌లో పేర్కొనగా, ‘ఆశ వదులుకోవద్దు’ అంటూ మరొక ట్వీట్‌ చేశారు. 

మరొకవైపు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ప్రశాంత్‌ కిషోర్‌ మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సోనియా నివాసంలో జరిగే భేటీకి పీకే హాజరుకానున్నారు. కాంగ్రెస్‌లో పీకే చేరిక, నిర్వర్తించాల్సిన బాధ్యతపై సోనియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీకే ప్రతిపాదనల్లో భాగంగా నియమించిన కమిటీతో కూడా సోనియా సమావేశం కానున్నారు. ఈ భేటీ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సైతం పాల్గొననున్నారు.  

చదవండి👉: పీకే టీమ్‌కు ఓకే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top