'క' సినిమాను గుర్తుచేస్తున్న తపాలా ఉద్యోగి నిర్లక్ష్యం | Postman From Bhadradri Shows Negligence To Deliver Post Cards To Public | Sakshi
Sakshi News home page

'క' సినిమాను గుర్తుచేస్తున్న తపాలా ఉద్యోగి నిర్లక్ష్యం

May 27 2025 1:03 PM | Updated on May 27 2025 2:08 PM

Postman From  Bhadradri Shows Negligence To Deliver Post Cards To Public

ఉన్నతాధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు 

భద్రాద్రి జిల్లా: మీరు కిరణ్‌ అబ్బవరం నటించిన 'క' సినిమా చూశారా.. ?  అదే తరహాలో ఓ తపాలా ఉద్యోగి తన బా ధ్యతలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును గ్రామస్తులు సోమవారం వెలుగులోకి తీసుకొచ్చారు. సదరు ఉద్యోగిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. అశ్వారావుపేట మండలం ఆసుపాక బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ శశాంక్‌.. 

పోస్టు ద్వారా గ్రామస్తులకు వచ్చిన ఆధార్‌ కార్డులు, బీమా పత్రాలు, పాన్, ఏటీఎం కార్డులతో పాటు పోలీస్‌ శాఖ ద్వారా వచ్చే నోటీసులను సైతం గత ఏడాది కాలంగా ఆయా వ్యక్తులకు అందించకుండా తన వద్దే ఉంచుకున్నాడని, తాము అడిగితే రాలేదని  సమాధానం చెప్పేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు పోస్టు ద్వారా వచ్చిని లేఖలను కూడా తన గదిలోనే పడేయడంతో అవి కుప్పలుగా పేరుకుపోయాయని తెలిపారు. 

తమకు రావాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్‌ కార్డులు రాకపోవడంతో కొందరు అనుమానం వచ్చి ఉద్యోగి గదిలోకి వెళ్లి చూడగా కుప్పలుగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. వీటిపై సదరు ఉద్యోగిని స్థానికులు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారంతా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై అశ్వారావుపేటలోని ప్రధాన తపాలా కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ తతంగం అంతా చూస్తుంటే కిరణ్‌ అబ్బవరం నటించిన 'క' సినిమా గుర్తుకు వస్తుందని అక్కడి గ్రామంలోని యువకులు అంటున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement