‘రామగుండం’లో ఉత్పత్తి ఆగలేదు

Pollution Board Gives Green Signal To Continuous Production In Ramagundam - Sakshi

ఆదివారం కూడా 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి

ఉత్పత్తిని కొనసాగించేందుకు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్‌ సిగ్నల్‌

యాజమాన్యం వినతిపై మధ్యంతర ఉత్తర్వులు

ఫెర్టిలైజర్‌ సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్‌ కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది. ఉత్పత్తిని ఆపాలని కాలుష్య నియంత్రణ మండలి శనివారం ఆదేశించింది. కానీ కర్మాగారంలో ఆదివారం కూడా 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. ఈ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయాల్సిందిగా శనివారం కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం సోమవారం మండలి అధికారులతో సమావేశమైంది. దేశవ్యాప్తంగా యూరియాకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో.. కర్మాగారంలో ఉత్పత్తి ఆపితే రైతులకు సకాలంలో ఎరువులు అందించడం ఇబ్బందిగా మారుతుందని తెలిపింది. అమ్మోనియా గ్యాస్, వ్యర్థ జలాల కాలుష్యంపై వివరణకు సమయం ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన అధికారులు ఎరువుల ఉత్పత్తిని కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ కమిషనర్‌ ఎం. రఘునందన్‌రావు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top