ఇన్నోవా కారులో ముగ్గురు.. ఎలాంటి లెక్కలు లేవు.. రూ. కోటి స్వాధీనం

Police Seized One Crore From 3 Persons In Manikonda - Sakshi

పోలీసుల అదుపులో ముగ్గురు

హ్యాకర్‌ల ముఠాగా అనుమానం

సాక్షి, మణికొండ: ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ఎలాంటి లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ. కోటి నగదును నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టగా టీఎస్‌ 15ఈబీ 3993 నెంబర్‌ గల ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఆపి తనిఖీ చేయగా నగదు దొరికింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం

ప్రాథమిక  విచారణలో భాగంగా వారు రూ.కోటి రూపాయలను నగదుగా హ్యాకర్‌లకు ఇస్తే వారు ఇతరుల బ్యాంక్‌ అకౌంట్లనుంచి తస్కరించి తమకు రూ. 2 కోట్లను బ్యాంక్‌ అకౌంట్‌లలోకి వేస్తారని అంగీకరించారని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్‌కంట్యాక్స్‌ శాఖకు అప్పగిస్తామని, తదుపరి విచారణతో పాటు వీరి వ్యవహారాలపై మంగళవారం లోతుగా విచారణ జరుపుతామన్నారు. అప్పటి వరకు డబ్బుతో దొరికిన వారి పేర్లు.. వివరాలను ఇచ్చేందుకు నార్సింగి పోలీసులు నిరాకరించారు. 
చదవండి: మసాజ్‌ సెంటర్ల సీజ్‌.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top