తీన్మార్‌ మల్లన్నపై మరో కేసు.. చిలకలగూడ పీఎస్‌లో హాజరు | Police Registered A Case Against Teenager Mallanna In Chilakaluguda PS | Sakshi
Sakshi News home page

తీన్మార్‌ మల్లన్నపై మరో కేసు.. చిలకలగూడ పీఎస్‌లో హాజరు

Aug 5 2021 3:46 PM | Updated on Aug 5 2021 4:51 PM

Police Registered A Case Against Teenager Mallanna In Chilakaluguda PS - Sakshi

హైదరాబాద్‌:  యూ ట్యూబ్‌ ఛానల్‌ క్యూ న్యూస్‌ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌ శర్మ ఫిర్యాదుతో తీన్మార్‌ మల్లన్నపై పోలీసులు మరో కేసు నమోదు  చేశారు. దీంతో తీన్మార్‌ మల్లన్న చిలకలగూడ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు.

కాగా తనను తీన్మార్‌ మల్లన్న బెదిరిస్తున్నాడని లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక క్యూస్‌ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ కింద పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement