న‌గ‌లు మాయ‌మైన కేసులో నిందితుల అరెస్ట్ | Police Have Arrested Four Accused In Jewelley Stolen Case | Sakshi
Sakshi News home page

న‌గ‌లు మాయ‌మైన కేసులో నిందితుల అరెస్ట్

Oct 22 2020 4:23 PM | Updated on Oct 22 2020 4:53 PM

Police Have Arrested Four Accused In Jewelley Stolen Case - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ :  బంజారాహిల్స్ పీఎస్ ప‌రిధిలో ఈనెల 9న బ్యాగ్‌లో న‌గ‌లు మాయ‌మైన కేసులో న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 143 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు సీపీ  అంజ‌నీకుమార్ తెలిపారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయ‌ల‌కు పైగానే ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన నిందితుడు నిరంజ‌న్‌తో పాటు న‌లుగురిని అదుపులోకి తీసుకోగా, మ‌రొక‌రు ప‌రారీలో ఉన్న‌ట్లు చెప్పారు. 

హైద‌రాబాద్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఈ నెల 9న జూబ్లీహిల్స్‌లోని ప్రదీప్ వీఎస్ జ్యూవెల్లరి నుంచి బంగారు ఆభ‌ర‌ణాలను తీసుకెళ్తుండ‌గా బైక్ కింద ప‌డి జ్యువెల‌రీ బ్యాగ్ కొట్టుకుపోయింది. దాదాపు మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వ‌ర‌ద‌లో కొట్టుకుపోగా అక్క‌డే ఉన్న గుడిసెల్లో నివ‌సిస్తున్న నిరంజ‌న్‌కి ఈ బ్యాగ్ దొరికింది.ఇదే అదునుగా భావించి బంధువులతో కలిసి నగలతో స‌హా నాగర్ కర్నూల్‌కు ఉడాయించారు. బ్యాగ్ మాత్రం అక్క‌డే వ‌దిలిపెట్టారు. దీంతో సెల్‌ఫోన్ సిగ్న‌ల్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. (దీక్షిత్‌ హత్య : గొంతు నులిమి చంపాడు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement