Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు | Pm Vice President Greet Telangana On Its Formation Day | Sakshi
Sakshi News home page

Telangana Formation Day: ప్రధాని, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

Jun 2 2021 9:33 AM | Updated on Jun 2 2021 10:22 AM

Pm Vice President Greet Telangana On Its Formation Day - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విశిష్ట సంస్కృతికి నిలయం. కష్టపడి పనిచేసే తత్వమున్న తెలంగాణ ప్రజలు అనేక రంగాలలో రాణించారు. వారికి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

చదవండి: బ్లాక్‌ఫంగస్‌ బాధితుడికి కేటీఆర్‌ అండ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement