ఇదేక్కడి పెంపుడు కుక్క రా బాబు.. రూ.1.50 లక్షల నగదు సంచితో..

Pet Dog Took Owners 1 5 lakh Money Bag in Warangal - Sakshi

దుగ్గొండి: యజమాని ఏదైనా పారేసుకుంటే పెంపుడు కుక్కలు తెచ్చిస్తాయి. కానీ.. ఈ కుక్క మాత్రం రివర్స్‌ చేసింది. తన యజమాని రూ.1.50 లక్షల నగదును దాచుకున్నజోలెను ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కాసు చేరాలు గొర్రెలకాపరి కావడంతో ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆయన సంపాదించిన డబ్బును ప్రత్యేకంగా కుట్టించుకున్న జోలె సంచిలో దాచుకుంటాడు. ఈ నెల 25న రాత్రి నడుముకు ఉన్న సంచి తీసి మంచంలో పెట్టి స్నానానికి వెళ్లాడు.

ఇంతలో పెంపుడు కుక్క ఆ సంచిని నోట కరుచుకుని వెళ్లి ఎక్కడో పడేసింది. అది తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు గమనించినా, ఏదోలే అని పట్టించుకోలేదు. బయటికి వచ్చిన చేరాలుకు మంచంపై బ్యాగ్‌ కనిపించకపోవడంతో వెదకడం మొదలుపెట్టాడు. కుక్క ఏదో పట్టుకుపోవడం చూశామని కుటుంబసభ్యులు చెప్పారు. అది డబ్బు సంచి అని చెప్పి... రెండు రోజులపాటు వెతికినా దొరకలేదు.గ్రామ పంచాయతీ వారు చాటింపు వేయించినా ఫలితం కనిపంచలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top