సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ రైలు ప్రారంభం.. దారిపొడవునా ఘన స్వాగతం

People Grand Welcome To Secunderabad Tirupati Vande Bharat Train - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో తొలిసారి రి తెలంగాణకు వచ్చారు. తన పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటిలో కొన్ని ప్రారంభోత్సవాలు, పలు  శంకుస్థాపనలు ఉన్నాయి.  తొలుత సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో తిరుపతి వందే భారత్‌ రైలుకు దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో స్వాగతం చెబుతూ.. వందే భారత్  రైలుతో సెల్ఫీలు దిగారు.స్టేషన్ల వద్ద స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా స్వాగతం పలికారు.

కాగా శనివారం ఉదయం 11.30 నిమిషౠలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన మోదీని గవర్నర్‌ తమిళిసై, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి వందే భారత్‌ రైలు ప్రారంభించడంతోపాటు రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్‌టీఎస్‌ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌లోని  పరేడ్‌గ్రౌండ్స్‌ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. అనంతరం చెన్నైకు ప్రయాణమయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top