కంటి ఆస్పత్రికి పేషంట్ల క్యూ.... అంతా దీపావళి టపాసుల బాధితులే!

patients queue to sarojini devi eye hospital hyderabad after diwali - Sakshi

హైదరాబాద్‌: నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకట్టారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది కంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వీరంతా దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడిన వారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది పెద్దవారే కావడం గమనార్హం.

దీపావళి సందర్భంగా టపాసులు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంత చెబుతున్నా మార్పు రావడం లేదు. ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా బాణాసంచా కాలుస్తూ గాయాల బారిన పడుతున్నారు. 

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు అవసరమని, ముఖ్యంగా కళ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top