ఈ నెలలో ప్రతి శనివారం పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్‌   | Passport Special Drive Every Saturday On December Month 2022: Dasari Balaiah | Sakshi
Sakshi News home page

ఈ నెలలో ప్రతి శనివారం పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్‌  

Dec 4 2022 1:56 AM | Updated on Dec 4 2022 8:15 AM

Passport Special Drive Every Saturday On December Month 2022: Dasari Balaiah - Sakshi

దాసరి బాలయ్య 

రాంగోపాల్‌పేట్‌: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో డిసెంబర్‌ నెలలోని అన్ని శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పీఎస్కేలు, 14 పీవోపీఎస్కేల్లో ఈ డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా దరఖాస్తుదారులకు 3200 అపాయింట్‌మెంట్లు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించినందుకు విదేశాంగ శాఖ అధికారులు, పోలీస్, పోస్టల్‌ శాఖలకు దరఖాస్తుదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement