సూర్యాపేట మార్కెట్‌లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు 

Paddy Purchase At Suryapet Market Yard - Sakshi

భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం సజావుగా సాగాయి. శనివారం రైతుల ఆందోళనలతో కాంటాలు నిలిచిపోవడం, కలెక్టర్‌ జోక్యం చేసుకుని రీ టెండర్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్‌ యార్డులో కలెక్టర్‌ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూశారు. దీంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచే కాంటాలు మొదలయ్యాయి.  26,455 బస్తాల ధాన్యాన్ని మార్కెట్‌ నుంచి కొనుగోలుదారులు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top