Osmania General Hospital: హెల్మెట్ డాక్టర్స్!

సాక్షి, అప్జల్‌గంజ్: రోగులకు ప్రాణం పోసే వైద్యులు వారు. కానీ.. తమ ప్రాణాలకే దిక్కులేకుండా పోయిందని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తమ తలలకు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. అంతకు ముందు అవుట్ పేషెంట్ బ్లాకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తించాలంటే భయంగా ఉందని, తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ ఆవేదన చెందారు.
చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు
సోమవారం డెర్మటాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ భువనశ్రీ తలపై ఫ్యాన్ ఊడి పడడంతో ఆమె గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే నూతన భవన నిర్మాణ దిశగా అడుగులు వేయాలని కోరారు.
చదవండి: హుజురాబాద్ ఉప పోరు: ఈ కొన్ని గంటలే కీలకం!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు