సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి–2026లో జరిగిన ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు, జూన్–2026లో జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల మెమోలను ఈ నెల 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు డిస్పాచ్ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు తమ ఒరిజినల్ ఎస్సెస్సీ మెమోలను నేరుగా తాము చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకోవాలని స్పష్టం చేశారు.


