ఓలా ఫౌండేషన్‌: ఇంటి ముందుకే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

Ola Foundation Free Door Delivery Of Oxygen Concentrators To Covid Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ రోగులకు ఓలా ఫౌండేషన్‌ అభయహస్తం అందించింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ బాధితుల వద్దకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఉచితంగా చేరవేసేందుకు ముందుకు వచ్చింది. ‘ఓ 2 ఫర్‌ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ను ఓలా ప్రతినిధులు కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదివేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఓలా హైదరాబాద్‌లో 500 కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులోకి తెస్తోంది. ఓలా యాప్‌ ద్వారా సమాచారం తీసుకుని రోగులకు చేరవేయడంతోపాటు, తిరిగి వాటిని శానిటైజ్‌ చేసి రోగికి అందుబాటులోకి తెస్తారు. ప్రత్యేక్షంగా శిక్షణ పొందినవారితో ఓలా క్యాబ్స్‌ ద్వారా వీటిని కోవిడ్‌ రోగులకు అందుబాటులోకి తెస్తారు.

స్వల్ప కోవిడ్‌ లక్షణాలతో బాధ పడుతున్న వారికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. రాజకీయనేతలు, అధికారులు, వివిధ వర్గాలవారు కోవిడ్‌ రోగులకు పలు రూపాల్లో సాయం అందిస్తున్నారని, అదేరీతిలో ఓలా ముందుకు రావడంపై రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి హర్షం వ్యక్తం చేశారు. మూడు, నాలుగు గంటల వ్యవధిలో బాధితులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఓలా సీఓఓ గౌరవ్‌ పొర్వాల్, సేల్స్‌ హెడ్‌ సుమిత్‌ ఆనంద్‌ వెల్లడించారు.
చదవండి: మేకప్‌ తీసేసి ట్రక్‌ ఎక్కింది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top