నిర్మల్‌ జిల్లాలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి | Nirmal Youth Dies Electric Shock Cotton Field Adilabad Telangana | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ జిల్లాలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

Oct 10 2026 11:54 PM | Updated on Oct 10 2026 11:54 PM

Nirmal Youth Dies Electric Shock Cotton Field Adilabad Telangana

తెలంగాణ: నిర్మల్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పత్తి పంటకు నీరు పెడుతున్న ఓ యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. చేతికొచ్చిన వయసులో యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్‌ జిల్లా మామడ మండలం పరిమండల్‌ గ్రామానికి చెందిన నూక నరేష్‌ (27) పత్తి చేనులో పంటకు నీరు పెడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.

విద్యుదాఘాతానికి గురైన నరేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: నల్లొండలో దారుణం.. ఇద్దరు బాలికల కిడ్నాప్‌ యత్నం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement